21.6.13

బెల్లం ఆవకాయ

బెల్లం ఆవకాయ

కావలసిన పదార్థాలు
మామిడికాయలు --2
కారం --3 కప్పులు 
ఉప్పు --3 కప్పులు
నూనె -- 3 కప్పులు
బెల్లం -- 1/4 కేజీ
ఆవపిండి -- 2 కప్పులు

తయారీవిధానము
మామిడికాయలను శుభ్రంగా కడిగి, తుడిచి ఉంచుకోవాలి. ముక్కలను తరిగి పెట్టుకోవాలి. బెల్లం మెత్తగా కోరి, అందులో కారం, ఉప్పు, ఆవపిండి మరియు నూనె ఒక కప్పు కలిపి ముక్కలను కలపాలి. 2 రోజు నుండి పాకం చిక్కబడే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన 2 కప్పుల నూనె ఈ ఆవకాయలో వేసి కలిపాలి. ఈ ఆవకాయ సంవత్సరమంతా నిల్వ ఉంటుంది.



No comments:

Post a Comment