27.6.13

పాలకూర పప్పు:--

పాలకూర పప్పు:--

కావలసిన పదార్థాలు:--
పాలకూర తరుగు -- 6 కప్పులు
కందిపప్పు -- 2 కప్పులు
ఉల్లిపాయముక్కలు -- 1 కప్పు
పచ్చిమిర్చి -- 3
ఉప్పు, పసుపు  -- తగినంత
కారం -- 1 స్పూన్
వెల్లులి -- 4 రెబ్బలు
పోపుదినుసులు --కొంచెం (కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు )
నూనె -- 4 స్పూన్స్

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ లో కడిగి పెట్టుకున్న కందిపప్పుని, పాలకూరని, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి పోపువేసి ఆ పోపులోనే ఉడికించిన తోటకూర పప్పుని వెయ్యాలి. ఉప్పు, పసుపు, కారం వేసి, 5 నిముషాలు తరవాత దించుకోవాలి. అంతే పాలకూర పప్పు రెడీ. ఇష్టమైనవారు ఈ పాలకూరని పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చును. ఇష్టమైతే టమాటాలు కూడా వేసుకోవచ్చును.    
తోటకూర పప్పు:--

తోటకూర పప్పు:--

కావలసిన పదార్థాలు:--
తోటకూర తరుగు -- 6 కప్పులు
కందిపప్పు -- 2 కప్పులు
ఉల్లిపాయముక్కలు -- 1 కప్పు
పచ్చిమిర్చి -- 3
ఉప్పు, పసుపు  -- తగినంత
కారం -- 1 స్పూన్
వెల్లులి -- 4 రెబ్బలు
పోపుదినుసులు --కొంచెం (కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు )
నూనె -- 4 స్పూన్స్

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ లో కడిగి పెట్టుకున్న కందిపప్పుని, తోటకూరని, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి పోపువేసి ఆ పోపులోనే ఉడికించిన తోటకూర పప్పుని వెయ్యాలి. ఉప్పు, పసుపు, కారం వేసి, 5 నిముషాలు తరవాత దించుకోవాలి. అంతే తోటకూర పప్పు రెడీ. ఇష్టమైనవారు ఈ తోటకూరని పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చును. ఇష్టమైతే టమాటాలు కూడా వేసుకోవచ్చును.
బచ్చలికూర పప్పు:--

బచ్చలికూర పప్పు:--

కావలసిన పదార్థాలు:--
బచ్చలికూర -- 3 కప్పులు
పెసరపప్పు -- 1 కప్పు              
ఉప్పు , పసుపు -- తగినంత
కారం -- 1 స్పూన్
వెల్లుల్లి రెబ్బలు -- 4
పచ్చిమిర్చి -- 3
నూనె -- 4 స్పూన్స్  
పోపుదినుసులు --కొంచెం (కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు )

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి కక్కర్ లో పెసరపప్పు , బచ్చలికూర, పచ్చిమిర్చి వేసి ఉడికించి దించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి పోపువేసి ఆ పోపులోనే ఉడికించిన బచ్చలికూర పప్పుని వెయ్యాలి. ఉప్పు, పసుపు, కారం వేసి, 5 నిముషాలు తరవాత దించుకోవాలి. అంతే బచ్చలికూర పప్పు రెడీ.
గోంగూర పప్పు

గోంగూర పప్పు

కావలసిన పదార్తాములు:--
గోంగూర తరుగు -- 6 కప్పులు
కందిపప్పు --2 కప్పులు
ఉల్లిపాయముక్కలు -- 2 కప్పులు
కారం -- 2 స్పూన్స్
పచ్చిమిర్చి -- 6
ఉప్పు, పసుపు --తగినంత
వెల్లుల్లి రెబ్బలు -- 4
పోపుదినుసులు --కొంచెం (కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు )
నూనె -- 4 స్పూన్స్

తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి, కందిపప్పుని ఉడికించుకోవాలి. ఉడికిన తరవాత, వేరే స్టవ్ మీద చిన్న బాణలి పెట్టి పోపువేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గోంగూర వేసి మెత్తగా ఉడికిన తరవాత ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని వేసి----- ఉప్పు , పసుపు, కారం వేసి గరిటతో మెత్తగా పప్పుని మెదుపుకోవాలి. 10 నిమిషాల తరవాత దించేసుకోవటమే. అంతే కమ్మని పుల్ల పుల్లని గోంగూరపప్పు రెడీ.
మెంతికూర పప్పు:--

మెంతికూర పప్పు:--

కావలసిన పదార్థాలు:--
మెంతిఆకులు -- 2 కప్పులు( ఏరి ఉంచుకోవాలి)
పెసరపప్పు -- 1 కప్పు
పచ్చిమిర్చి -- 3
కారం -- 1 స్పూన్
వెల్లుల్లి రెబ్బలు -- 3
పోపుదినుసులు --కొంచెం (కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు )
ఉప్పు, పసుపు -- తగినంత
నూనె -- 2 స్పూన్స్

తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, కుక్కర్ పెట్టి, అందులో కడిగిపెట్టుకున్న పెసరపప్పుని, మెంతికూరని, పచ్చిమిర్చిని అన్నిటిని కలిపి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద చిన్న బాణలి పెట్టి పోపు వేయించుకోవాలి. ఉడికిన పప్పులో ఈ పోపుని వేసి, ఉప్పు, పసుపు, కారం & కొత్తిమీర... కలిపి వేరే డిష్ లో ఉంచుకోవాలి. అంతే మెంతికూర పప్పు రెడీ. ఇదే విధంగా కందిపప్పుతో కూడా చేసుకోవచ్చును. చపాతీ లో కూడా ఈ పప్పుని తినొచ్చును.


చుక్కకూర పప్పు

చుక్కకూర పప్పు

కావలసిన పదార్థాలు:--
చుక్కకూర -- 2 కట్టలు
కందిపప్పు -- 2 కప్పులు
పచ్చిమిర్చి -- 4
కారం -- 1 స్పూన్
ఉప్పు, పసుపు -- తగినంత
ఉల్లిపాయముక్కలు -- 1 కప్పు
కొత్తిమీర -- కొంచెం
పోపుదినుసులు -- కొంచెం (కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు )
నూనె -- 4 స్పూన్స్

తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, కుక్కర్ పెట్టి, అందులో కడిగిపెట్టుకున్న కందిపప్పుని, చుక్కకూరని & ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని అన్నిటిని కలిపి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద చిన్న బాణలి పెట్టి పోపు వేయించుకోవాలి. ఉడికిన పప్పులో ఈ పోపుని వేసి, ఉప్పు, పసుపు, కారం & కొత్తిమీర... కలిపి వేరే డిష్ లో ఉంచుకోవాలి. ఇదే విధంగా, పెసరపప్పుతోను, సెనగపప్పుతోను కూడా చేసుకోవచ్చును. అంతే కమ్మని చుక్కకూర పప్పు రెడీ.


25.6.13

నువ్వుల అప్పాలు:--

నువ్వుల అప్పాలు:--

కావలసిన పదార్థాలు:--
వరిపిండి---- 2 కప్పులు 
మైదాపిండి -- 1 కప్పులు 
గోధుమపిండి -- 1 కప్పు 
నువ్వులుపప్పు -- 1 కప్పు
యాలకులపొడి -- 2 స్పూన్స్
పంచదార -- 2 కప్పులు
నూనె --- 1/2 కేజీ
నీళ్ళు -- 2 కప్పులు
వంటసోడా -- చిటికెడు

తయారీవిధానం:--

ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో 2 కప్పులు నీళ్ళు పోసి, పంచదార వేసి.....పంచదార అంతా మరుగుతూ ఉన్నప్పుడు అన్ని రకాల పిండిలు వేసి, నువ్వులుపప్పు కూడా వేసి చిటికెడు వంటసోడా----కొంచెం నూనె, యాలకుల పొడి అన్నీ వేసి.... కలిపి కిందకి దించుకోవాలి. పిండి చల్లారిన తరవాత...... చేతికి నూనె రాసుకొని, పిండిని చిన్న--చిన్న ఉండలు చేసుకొని అరటిఆకు మీద ఐనా.... ప్లాస్టిక్ కవరు మీద ఐనా.....నూనె రాసి....ఉండలని పలుచగా చిన్న చిన్న వడలులాగా... చేతితో వత్తుకోవాలి..... ఇప్పుడు అన్నీ చేసిన తరవాత........ స్టవ్ మీద బాణలి పెట్టి, నూనె వేసుకొని సన్నటి సెగ మీద అన్నీ వేయించి తీసుకోవాలి. ఇవి వారం రోజులవరకు నిల్వ ఉంటాయి. అంతే కరకరలాడే తియ్యని నువ్వుల అప్పాలు రెడీ.


బెల్లం అప్పాలు:--

బెల్లం అప్పాలు:--

కావలసిన పదార్థాలు 
వరిపిండి -- 2 కప్పులు 
గోధుమపిండి -- 2 కప్పులు 
బెల్లంకోరు -- 2 కప్పులు 
యాలకులపొడి -- 1 స్పూన్
నూనె -- 1/4 కేజీ
నీళ్ళు -- 2 కప్పులు

తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో 2 కప్పులు నీళ్ళు పోసి, బెల్లం వేసి.....బెల్లం అంతా మరుగుతూ ఉన్నప్పుడు వరిపిండి & గోధుమపిండి వేసి,----కొంచెం నూనె, యాలకుల పొడి వేసి.... కలిపి కిందకి దించుకోవాలి. పిండి చల్లారిన తరవాత...... చేతికి నూనె రాసుకొని, పిండిని చిన్న--చిన్న ఉండలు చేసుకొని అరటిఆకు మీద ఐనా.... ప్లాస్టిక్ కవరు మీద ఐనా.....నూనె రాసి....ఉండలని పలుచగా చిన్న చిన్న వడలులాగా... చేతితో వత్తుకోవాలి..... ఇప్పుడు అన్నీ చేసిన తరవాత........ స్టవ్ మీద బాణలి పెట్టి, నూనె వేసుకొని సన్నటి సెగ మీద అన్నీ వేయించి తీసుకోవాలి. ఇవి వారం రోజులవరకు నిల్వ ఉంటాయి. అంతే తియ్యని బెల్లం అప్పాలు రెడీ.


వెన్న అప్పాలు:--

వెన్న అప్పాలు:--

కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 1/2 కేజీ 
పంచదార 1/4 కేజీ 
వెన్న -- 1 కప్పు 
యాలకులపొడి -- 1 స్పూన్
నూనె -- 1/2 కేజీ

తయారీవిధానం:--
బియ్యం 4 గంటల ముందుగా నానబెట్టుకుని, నీరు అంతా వడగట్టి, ఎండలో ఆరబెట్టుకోవాలి... తడిపొడిగా ఉన్నప్పుడే బియ్యాన్ని పిండిలాగా మర (మిల్లు) పట్టించాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నెలో పంచదార వేసి, ఒక కప్పు నీళ్ళు పోసి. ఏలకులపొడి వేసి, మరుగుతున్నప్పుడు , వరిపిండిని.... వెన్నని వేసి బాగా కలిపి దించెయ్యాలి. చల్లారిన తరవాత పళ్ళెంలో వేసి పూరి పిండిలాగా బాగా మదాయించుకోవాలి. (రోలు ఉన్నవాళ్లు అప్పడాల పిండి మాదిరిగా....బాగా బండతో దంచాలి....ఎంత బాగా దంచితే అంతబాగా మృదువుగా వస్తాయి.) చేతికి నూనె రాసుకొని, పిండిని చిన్న--చిన్న ఉండలు చేసుకొని అరటిఆకు మీద ఐనా.... ప్లాస్టిక్ కవరు మీద ఐనా.....నూనె రాసి....ఉండలని పలుచగా చిన్న చిన్న వడలులాగా... చేతితో వత్తుకోవాలి..... ఇప్పుడు అన్నీ చేసిన తరవాత........ స్టవ్ మీద బాణలి పెట్టి, నూనె వేసుకొని సన్నటి సెగ మీద అన్నీ వేయించి తీసుకోవాలి. ఇవి నెల రోజులవరకు నిల్వ ఉంటాయి. అంతే ఎంతో రుచికరమయిన......నోట్లోవేస్తే కరిగిపోయే వెన్న అప్పాలు రెడీ.

చంద్రకాంతలు:--

చంద్రకాంతలు:--

కావలసిన పదార్థాలు:--
పెసరపప్పు -- 2 కప్పులు 
పంచదార -- 3 కప్పులు 
కొబ్బరికోరు -- 1 కప్పు 
జీడిపప్పు -- 1/4 కప్పు
వంటషోడా -- చిటికెడు
యాలకులపొడి -- 1 స్పూన్
నూనె -- 1/2 కేజీ
నెయ్యి -- 4 స్పూన్స్

తయారీవిధానం:--
పెసరపప్పుని 2 గంటల ముందుగా నానబెట్టుకొని, మిక్సీలో మెత్తగా నీళ్ళు పోయకుండా... గారెలపిండి మాదిరిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో పంచదార వేసి, రుబ్బిన మిశ్రమాన్ని , కొబ్బరికోరుని,. యాలకులపొడిని, జీడిపప్పు ముక్కలు అన్నీ వేసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం గట్టిపడిన తరవాత 2 స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పళ్ళానికి నెయ్యిరాసి, అందులో ఈ మిశ్రమాన్ని వేసి పలుచగా సర్దుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు ఇష్టమైన shapes లో cut చేసుకోవాలి. ముక్కలు అన్నీ చల్లారిన తరవాత..... స్టవ్ వెలిగించి.... బాణలిపెట్టి, నూనె పోసి, సన్నని సెగ మీద కొద్ది కొద్దిగ ముక్కలు వేసుకొని గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అంతే కమ్మని, అందమైన చంద్రకాంతలు రెడీ.


21.6.13

చక్కెర పొంగలి

చక్కెర పొంగలి:--

కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 2 కప్పులు
వేయించిన పెసరపప్పు -- 1/2 కప్పు
బెల్లంకోరు -- 4 కప్పులు
నెయ్యి -- 1కప్పు
ఏలకుల పొడి -- 1 స్పూన్
జీడిపప్పు -- 50 గ్రాములు
కిస్ మిస్ -- 25 గ్రాములు

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బియ్యం, పెసరపప్పు కలిపి కుక్కర్ లో మెత్తగా ఉడికించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసి మెత్తగా గరిటతో కలుపుతూ స్టవ్ మీద సన్నని మంటపై, ఉడికించితే, బెల్లం అంతా కరిగి మెత్తగా పాకంలాగా వస్తుంది. ఇది ఉడికే లోపున....వేరే స్టవ్ మీద చిన్న పాత్రలో నెయ్యి వేసి, వేడిచేసి అందులో జీడిపప్పు, కిస్ మిస్ లు దోరగా వేయించి, చక్కర పొంగలిలో వేసి, ఏలకుల పొడి వేసి కలిపి దగ్గరగా అయిన తరవాత, దించుకోవటమే. అంతే ఎంతో రుచికరమైన తియ్యని చక్కెర పొంగలి రెడీ.టమాట పచ్చడి

టమాట పచ్చడి

కావలసిన పదార్థాలు:--
టమాటాలు -- 1/2 కేజీ 
కారం -- 1 కప్పు 
ఉప్పు --తగినంత
మెంతులు పొడి -- వేయించి పొడి చేసుకోవాలి -- 2 స్పూన్స్
పోపుదినుసులు -- సెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు & ఇంగువ.
నూనె -- 150 గ్రాములు

తయారీవిధానము:--
ముందుగా టమాటాలను శుభ్రం చేసి, ముక్కలు కోసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, కొంచెం నూనె వేసి టమాటా ముక్కల్ని వేయించుకోవాలి. మూత పెట్టకుండా, సన్నని సెగమీద, వేయించుకోవాలి. ముక్కల్లో ఉన్న నీరు అంతా పోయి, నూనె మిగిలే వరకూ వేయించుకోవాలి. దీనిలో ఉప్పు & కారం వేసి, ముక్కలన్నీ మెత్తగా అయ్యేంతవరకు గరిటతో కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాణలిలో మెంతుల్ని, నూనె లేకుండా దోరగా వేయించి, పొడి చేసి, టమాటా పచ్చట్లో కలుపుకోవాలి. మిగిలిన నూనెలో సెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి , ఇంగువ & కరివేపాకు వేసి వేయించి పచ్చడి మీద వేసి కలుపుకోవాలి. ఇది చల్లారాక సీసాలో దాచుకుంటే, నెల రోజులవరకు ఉంటుంది. అంతే కమ్మని టమాటా పచ్చడి రెడీ.
గోంగూర పచ్చడి

గోంగూర పచ్చడి

కావలసిన పదార్థాలు 
గోంగూర (కడిగి ఆరబెట్టిన గోంగూర ఆకులు)-- 8 కప్పులు 
ఎండుమిర్చి 50 గ్రాములు
ఉప్పు -- తగినంత
పోపు దినుసులు --ఆవాలు, మెంతులు, ఇంగువ.
ఉల్లిపాయల ముక్కలు-- ఒక కప్పు
నూనె -- 1/2 కప్పు

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనె వేసి, వేడి ఎక్కిన తరవాత, పోపు వేసుకుని, చివర్లో ఎండుమిర్చి & ఇంగువ వేసి దించి, వేరే ప్లేటులో పెట్టుకోవాలి. అదే బాణలిలో కొంచెం నూనె వేసి, గోంగూరని వేసి, సన్నటి సెగమీద వేయించుకోవాలి. ఆకు బాగా దగ్గర పడేవరకు వేయించుకోవాలి. చల్లారిన తరవాత పోపులో ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా అయ్యిన తరవాత గోంగూరని కూడా వేసి తిప్పాలి. మరీ పేస్టు లాగా తిప్పకూడదు. చివరిగా పచ్చట్లో కొంచెం నూనె వేడి చేసి.... ఆవాలు &ఇంగువ వేయించి పచ్చడి పైన వేసుకోవాలి. ఉల్లిముక్కల్ని వేసి కలుపుకుంటే బావుంటుంది. అంతే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ.
పెసరట్టు

పెసరట్టు
కావలసిన పదార్థాలు 
పెసలు -- 2 కప్పులు 
పెసరపప్పు -- 1 కప్పు 
అల్లం ముక్కలు -- 3 స్పూన్స్ 
పచ్చిమిర్చి ముక్కలు -- 4 స్పూన్స్
జీలకర్ర -- 1 స్పూన్
సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు -- 2 కప్పులు
ఉప్పు & నూనె -- తగినంత

తయారీ విధానం
అట్లు వేసుకునే 6 గంటల ముందు, పెసలని, పెసరపప్పుని---నానబెట్టి,రుబ్బుకొని, తగినంత ఉప్పు కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని, పెనం( pan ) పెట్టి, నూనె రాసి.... పిండి వేసి, గరిటతో తిప్పి , గుండ్రంగా వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి, జీల్లకర్ర ... అన్నీ కలిపి అట్టుపైన వేసి, కొంచం ఎర్రగా కాల్చుకోవాలి.... అంతే పెసరట్టు రెడీ. దేనిలోకి అల్లం పచ్చడి బావుంటుంది. కొబ్బరి చట్నీ తో తిన్న బావుంటుంది.
పేపర్ దోశ

పేపర్ దోశ

కావలసిన పదార్థాలు
మినప్పప్పు -- 1 కప్పు 
బియ్యం -- 2 కప్పులు 
అటుకులు -- 1 కప్పు
ఉప్పు -- తగినంత
జీలకర్ర -- 1 స్పూన్
నూనె -- తగినంత  


తయారీ విధానం
మినప్పప్పు & బియ్యం 4 గంటలు ముందుగా నానబెట్టి, రుబ్బుకుని, ఉప్పు & జీలకర్ర కలిపి 8 గంటలు నాననివ్వాలి. పప్పు రుబ్బే ఒక అరగంట ముందుగా అటుకులని కడిగి నానబెట్టి రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, పెనం (pan) పెట్టుకొని, వేడి ఎక్కిన తరవాత నూనె రాసి, దోశని వేసుకొని, దోరగా కాలిన తరవాత తీసేయ్యటమే. పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకుంటే, పెనం మీద వేసేటప్పుడు గట్టిగా రుద్ది దోశని వేస్తె పల్చగా...... పేపర్ లాగా దోశ వస్తుంది. అంతే ఎంతో రుచిగా ఉండే పేపర్ దోశ రెడీ....... ఈ దోశకి పుట్నాలు +కొబ్బరి చట్నీ, సాంబారులతో కలిపి తింటే ఎంతో బావుంటుంది....
మసాలాదోశ

మసాలాదోశ

కావాలసిన పదార్థాలు
మినప్పప్పు -- 2 కప్పులు 
బియ్యం -- 4 కప్పులు 
ఉప్పు & నూనె -- తగినంత
మరమరాలు( మూరీలు) --2 కప్పులు
జీలకర్ర -- 1 స్పూన్

మసాలకూరకి కావలసిన పదార్థాలు
బంగాళదుంప -- 1/2 కేజీ
ఉల్లిపాయలు -- 1/4 కేజీ
ఉప్పు & పసుపు --తగినంత
గరం మసాలా పొడి -- 1స్పూన్
నూనె -- తగినంత .

కూర తయారీవిధానము
బంగాళాదుంపల్ని ఉడికించి, తొక్కుతీసుకొని, ముద్దలాగా చేసి ఉంచుకోవాలి. ఉల్లిపాయల్ని & పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, ఉల్లిపాయ & పచ్చిమిర్చి ముక్కల్ని దోరగా వేయించి, అందులో ఉడికించి, ముద్దచేసుకున్న బంగాయదుంపలని వేసి, ఉప్పు, గరం మసాలా వేసుకోవాలి. ఒక గ్లాస్ నీరు పోసి ఇంకేంతవరకు ఉంచి దింపుకుంటే కూరకి మసాలా బాగా పడుతుంది. అంతే కూర రెడీ అయ్యింది, పక్కన ఉంచుకోవాలి......

దోశ తయారీవిధానం
మినప్పప్పు, బియ్యం & మెంతులు 4 గంటలు ముందుగా నానబెట్టి, రుబ్బుకుని, ఉప్పు & జీలకర్ర కలిపి 8 గంటలు నాననివ్వాలి. పప్పు రుబ్బే ఒక అరగంట ముందుగా మూరీలని నానబెట్టి రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, పెనం (pan) పెట్టుకొని, వేడి ఎక్కిన తరవాత నూనె రాసి, దోశని వేసుకొని, దోరగా కాలిన తరవాత, ఒక గరిట కూరని దోశమీద ఉంచి మడిచి తీసి, పక్కన పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మసాలాదోశ రెడీ....... ఈ దోశకి పుట్నాల + కొబ్బరిచట్నీ, సాంబారులతో కలిపి తింటే ఎంతో బావుంటుంది....
ఉల్లిదోశ

ఉల్లిదోశ

కావలసిన పదార్థాలు
మినప్పప్పు -- 2 కప్పులు 
బియ్యం --4 కప్పులు 
మెంతులు -- 1 స్పూన్
చిన్నగా (సన్నగా)తరిగిన ఉల్లిపాయల ముక్కలు -- 3 కప్పులు
పచ్చిమిరపకాయల ముక్కలు(చిన్నముక్కలు) -- 4 స్పూన్స్
జీలకర్ర -- 1స్పూన్
ఉప్పు -- తగినంత

తయారీవిధానం
ముందుగా మినప్పప్పు, బియ్యం & మెంతులు కలిపి 4 గంటలు నానబెట్టుకొని, రుబ్బి , ఉప్పు కలుపుకొని 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, పెనం (pan) పెట్టి, వేడి ఎక్కిన తరవాత పెనం మీద నూనె రాసి గరిటతో పిండిని గుండ్రంగా వేసి పైన తరిగిపెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి & జీలకర్ర జల్లుకోవాలి. దోరగా ఒకప్రక్కనే కాల్చుకొని తీసుకోవాలి. సన్నని మంటపై కాల్చుకోవాలి. అంతే నోరూరించే ఉల్లిదోశ రెడీ. ఈ దోశలని పుదీనా చట్నీ, అల్లం చట్నీలతో తింటే బావుంటుంది.రవ్వదోశ

రవ్వదోశ

కావలసిన పదార్థాలు
మైదాపిండి:-- 1 కప్పు 
బియ్యంపిండి -- 2 కప్పులు 
బొంబాయి రవ్వ(గోధుమనూక)--- 1/2 కప్పు
జీలకర్ర -- 1 చిన్న స్పూన్
పచ్చిమిర్చి & అల్లం పేస్టు -- 2 స్పూన్స్
ఉప్పు -- తగినంత

తయారి విధానం
ముందుగా అన్నిరకాల పిండిల్ని జల్లించి, బాగుచేసుకొని.... ఉప్పు, జీలకర్ర, అల్లం & పచ్చిమిర్చి పేస్టు వేసి.... నీళ్ళు పోసి, జారుగా దోసలపిండిలాగా కలుపుకోవాలి..... ఇప్పుడు స్టవ్ వెలిగించి... పెనం (pan) పెట్టి, వేడిఎక్కాక, కొద్దిగా నూనె రాసి, ఒక చిన్న గ్లాస్ తో పిండిని గుండ్రంగా దోసలాగా పొయ్యాలి. దోసమొత్తమ్ చిల్లులుచిల్లుగా అందంగా వస్తుంది.......ఇష్టమైన వారు ఈ దోసపైన కొబ్బరికోరు(కొబ్బరితురుము) వేసుకోవచ్చును....దీనిని ఊల్లి చట్ని & కొబ్బరిచట్నీ తో తింటే చాలా బావుంటుంది. అంతే వేడి వేడి కమ్మని రవ్వదోశ రెడీ.... 
గుంతపొంగడాలు

గుంతపొంగడాలు

కావలసిన పదార్థాలు:--
మినపప్పు -- 1 కప్పు 
బియ్యం -- 2 కప్పులు 
ఉప్పు -- తగినంత
అల్లం.. పచ్చిమిర్చి ముద్ద -- 2 స్పూన్స్
నూనె -- కొంచెం

తయారీవిధానం:--
పప్పు & బియ్యం 3 గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి.....రుబ్బులో అల్లం పచ్చిమిర్చి ముద్దని కలుపుకొని, 10 గంటలు నానబెట్టాలి.....ఇప్పుడు స్టవ్ వెలిగించి, పొంగడాల మూకుడు పెట్టి, గుంతల్లో నూనె వేసి, పిండి పోసి, 2 నిముషాలు ఉంచి, తిరగవేసి, కొంచెం నూనె వేస్తె .... చక్కగా ఇరువైపులా బాగా కాలి, పొంగుతాయి... చూడటానికి బూరెల్లా ఉన్నా.... తినటానికి పుల్లపుల్లగా.... కారంకారంగా.... చాల రుచికరంగా ఉంటాయి... మనకి ఇష్టమైన చట్నీని నంచుకోవచ్చును.....
గవ్వలు

గవ్వలు

కావలసిన పదార్థాలు:--
మైదాపిండి -- 3 కప్పులు 
గోధుమనూక( బొంబాయి రవ్వ)-- 1 కప్పు 
పంచదార -- 4 కప్పులు
ఉప్పు & వంటసోడా -- చిటెకెడు
నూనె -- 1/2 కేజీ

తయారీవిధానము:--
ఒక డిష్ లో మైదాపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు & వంటసోడా వేసి, కొంచెం వేడి చేసిన నూనెను వేసి, నీరు పోస్తూ పూరీ పిండిలాగా కలిపి, ఒక గంటసేపు నానబెట్టుకోవాలి. గవ్వలబల్లకి కొంచెం నూనె రాసుకొని, పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బల్లమీద పెట్టి, గవ్వలుగా చేసుకోవాలి. అన్నీ అయ్యిన తరవాత.... స్టవ్ వెలిగించి, బాణలిపెట్టి, నూనెపోసుకొని, గవ్వలను వేయించుకోవాలి. అన్నీ వేయించిన తరవాత, ఒక గిన్నెలో పంచదార వేసి కొంచెం నీరు పోసుకొని, ఉండ పాకం వచ్చాక వేయించి తీసుకున్న గవ్వలను పాకంలో వేసి కలుపుకోవాలి. అంతే తియ్యని, కమ్మని గవ్వలు రెడీ....
తీపి ఇష్టంలేని వారు ఉప్పు --కారం వేసి చేసుకోవచ్చును.
మైదాపిండి బిస్కట్స్

మైదాపిండి బిస్కట్స్


కావలసిన పదార్థాలు:--
మైదాపిండి -- 3 కప్పులు
గోధుమనూక( బొంబాయి రవ్వ)-- 1 కప్పు
పంచదార -- 4 కప్పులు
ఉప్పు & వంటసోడా -- చిటెకెడు
నూనె -- 1/2 కేజీ

తయారీవిధానం:--
ఒక డిష్ లో మైదాపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు & వంటసోడా వేసి, కొంచెం వేడి చేసిన నూనెను వేసి, నీరు పోస్తూ పూరీ పిండిలాగా కలిపి, ఒక గంటసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పూరీ లాగా వత్తుకొని, మనకి ఇష్టమైన డిజైన్ లలో ముక్కలని కోసుకోవాలి. అన్నీ అయ్యిన తరవాత..... స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి కాగాక, కొంచెం కొంచెం ముక్కల్ని నూనెలో వేస్తూ, గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అన్నీ వేయించిన తరవాత, ఒక గిన్నెలో పంచదార వేసి కొంచెం నీరు పోసుకొని, ఉండ పాకం వచ్చాక వేయించి తీసుకున్న
బిస్కట్స్ ని పాకంలో వెయ్యాలి. అంతే... కమ్మగా.... నోట్లో వేస్తే కరిగిపోయే బిస్కట్స్ రెడీ....
తీపి ఇష్టంలేని వారు ఉప్పు --కారం వేసి చేసుకోవచ్చును.


జంతికలు(మురుకులు)

జంతికలు(మురుకులు)


కావలసిన పదార్థాలు
సెనగపిండి -- 2 కప్పు 

వరిపిండి -- 2 కప్పులు 
నువ్వులపప్పు -- 1/4 కప్పు
ఉప్పు & కారం -- తగినంత
నూనె -- 1/2 కేజీ

తయారీవిధానం
ముందుగా ఒక పెద్ద డిష్ లో సెనగపిండి, వరిపిండి, ఉప్పు, కారం, నువ్వులపప్పు అన్నీ వేసి కొంచెం కొంచెం నీరు పోస్తూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, కాగాక జంతికల గొట్టంలో పిండిని వేసి నూనె లో గుండ్రంగా తిప్పుతూ వెయ్యాలి. బంగారపు రంగు వచ్చినతరవాత నూనెలోనుండి తియ్యాలి. అంతే కరకరలాడే కమ్మని జంతికలు(మురుకులు) రెడీ.


చెగోడీలు

చెగోడీలు

కావలసిన పదార్థాలు
వరిపిండి -- 4 కప్పులు
నీళ్ళు -- 4 కప్పులు
ఉప్పు --తగినంత
కారం -- 3 స్పూన్స్
జీలకర్ర -- 1 స్పూన్
పెసరపప్పు -- 1/4 కప్పు
ఇంగువ -- కొంచెం
నూనె -- 1/2 కేజీ

తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో నీరు పోసి, నీటిలో పెసరపప్పు, ఉప్పు, కారం, జీలకర్ర & ఇంగువ వేసి నీటిని బాగా మరిగించాలి.... మరిగిన తరవాత వరిపిండిని ఆ నీటిలో వేస్తూ ఉండకట్టకుండా కొంచెం నూనె వేసి కలిపి ముతపెట్టుకోవాలి. పిండి చల్లారిన తరవాత ఒక పీట తీసుకుని, పీట మీద కొంచెం నూనె రాసి, పిండి వేసి బాగా మదాయించాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేగోడీలు చేసుకోవాలి. అన్నీ తయారయ్యాక..... స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి కాగాక చేగోడీలు కొన్ని కొన్ని వేస్తూ దోరగా వేయించి తీసుకోవాలి. అంతే కరకరలాడే కమ్మని చేగోడీలు రెడీ.....మామిడికాయ & పెసరపప్పు పచ్చడి

మామిడికాయ & పెసరపప్పు పచ్చడి

కావలసిన పదార్థాలు
మామిడికాయ --1 
పెసరపప్పు --1 కప్పు 
ఎండుమిర్చి --6
ఉప్పు --రుచికితగినంత
పసుపు -- చిటికెడు
పోపుదినుసులు -- ఎండుమిర్చి, ఆవాలు & ఇంగువ

తయారీవిధానము
పచ్చడి చేసే ఒక గంట ముందుగా పెసరపప్పును నానబెట్టుకోవాలి. మామిడికాయని చెక్కు తీసి, చిన్ని ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. మామిడి ముక్కల్ని, నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని, ఎండుమిర్చి, ఉప్పు & పసుపు వేసి మిక్సీ లో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, ఆవాలు, ఎండుమిర్చి & ఇంగువ వెయ్యాలి. పోపు వేగాక పచ్చట్లో వేసి కలపాలి. అంతే పుల్ల పుల్లని మామిడికాయ--పెసరపప్పు పచ్చడి రెడీ.మాగాయ

మాగాయ
కావలసిన పదార్థాలు
మామిడి కాయలు -- 6
ఉప్పు -- 2 కప్పులు 
కారం --2 కప్పులు
మెంతిపొడి -- 3 స్పూన్స్(నూనె లేకుండా మెంతులు దోరగా వేయించి, పొడి చేసి ఉంచుకోవాలి)
నూనె -- 1/4 కేజీ
పోపుదినిసులు --ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు & ఇంగువ.
పసుపు -- 1 స్పూన్

తయారీ విధానము
మామిడికాయలు శుభ్రం చేసాక, చెక్కు తీసి, పల్చగా & సన్నగా ముక్కలు తరిగిపెట్టుకోవాలి. ఈ ముక్కలలో ఉప్పు & పసుపు వేసి కలిపి మూతపెట్టుకుని, 3 వ రోజు ఆ ఊటలోనుండి ముక్కలు గట్టిగా పిండి వేరేగా తీసి, ముక్కలు వేరేగా, ఊట వేరేగా ఎండబెట్టుకోవాలి. ముక్కలు బాగా ఎండిన తరవాత, ఊటలో వేసి కలపాలి. ఇప్పుడు దీనిలో కారం & మెంతిపొడి కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి & ఇంగువ వెయ్యాలి. వేగిన తరవాత దించి, చల్లారిన తరవాత మాగాయముక్కలలో వేసి కలపాలి. అంతే ఎంతో పుల్లని, కారం మాగాయపచ్చడి రెడీ. ఈ మాగాయ పచ్చడి జాగ్రత్తగా జాడీలో దాచి ఉంచితే, ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది.


బెల్లం ఆవకాయ

బెల్లం ఆవకాయ

కావలసిన పదార్థాలు
మామిడికాయలు --2
కారం --3 కప్పులు 
ఉప్పు --3 కప్పులు
నూనె -- 3 కప్పులు
బెల్లం -- 1/4 కేజీ
ఆవపిండి -- 2 కప్పులు

తయారీవిధానము
మామిడికాయలను శుభ్రంగా కడిగి, తుడిచి ఉంచుకోవాలి. ముక్కలను తరిగి పెట్టుకోవాలి. బెల్లం మెత్తగా కోరి, అందులో కారం, ఉప్పు, ఆవపిండి మరియు నూనె ఒక కప్పు కలిపి ముక్కలను కలపాలి. 2 రోజు నుండి పాకం చిక్కబడే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన 2 కప్పుల నూనె ఈ ఆవకాయలో వేసి కలిపాలి. ఈ ఆవకాయ సంవత్సరమంతా నిల్వ ఉంటుంది.నూలుపొడి ఆవకాయ

నూలుపొడి ఆవకాయ
కావలసిన పదార్థాలు
మామిడికాయలు --2
నువ్వులపప్పు --4 కప్పులు
కారం --2 కప్పులు
ఉప్పు --2 కప్పులు
నూనె --3 కప్పులు

తయారీ విధానము
మామిడికాయలు శుభ్రంగా కడిగి, తుడుచుకొని, చిన్నముక్కలుగా కోసుకోవాలి. నువ్వులపప్పును ఎండబెట్టి మెత్తగా పొడిచేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్దగిన్నె తీసుకొని, తరిగిపెట్టిన మామిడి ముక్కలులో-- ఉప్పు, కారం, నువ్వులపిండి & నూనె అన్నీ వేసి కలపాలి. ఇది 3 రోజుల తరవాత మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి . ఇష్టమైనవారు ఈ ఆవకాయలో కొన్ని ఆవాలు & ఇంగువ వేసి పోపు పెట్టుకోవచ్చును. ఇప్పుడు దీనిని ఒక సీసాలోకి ఎత్తి దాచుకోవాలి. ఇది 2 నెలలు మాత్రమే నిల్వ ఉంటుంది.అందుకే ఎక్కువగా పెట్టుకోరాదు.పెసర ఆవకాయ

పెసర ఆవకాయ
కావలసిన పదార్థాలు
మామిడికాయలు--2
పెసరపప్పు --3 కప్పులు 
కారం --2 కప్పులు
ఉప్పు --2 కప్పులు
నూనె -- 3 కప్పులు


తయారీ విధానము
మామిడికాయలు శుభ్రంగా కడిగి, తుడుచుకొని, చిన్నముక్కలుగా కోసుకోవాలి. పెసరపప్పు ఎండబెట్టి మెత్తగా పొడిచేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్దగిన్నె తీసుకొని, తరిగిపెట్టిన మామిడి ముక్కలులో-- ఉప్పు, కారం, పెసరపిండి & నూనె అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు దీనిని జాడీలోకి ఎత్తి దాచుకోవాలి. వేసవి కాలంలో, పెద్ద ఆవకాయకి బదులు... ఈ పెసర ఆవకాయ ని వాడితే వేడి చెయ్యకుండా ఉంటుంది. ఇది 4 నెలలు నిల్వ ఉంటుంది
పెరుగు గారెలు

పెరుగు గారెలు

కావలసిన పదార్థాలు:::
మినపపప్పు --1 కేజీ
చిక్కటి, కమ్మటి పెరుగు -- 1లీటరు
ఉప్పు -- తగినంత
ఆవాలు -- 1 స్పూన్
పోపుదినుసులు -- కొంచెంగా
అల్లం ముక్క - చిన్నది
పచ్చిమిర్చి --10
కొత్తిమీర -- ఒక కట్ట
పసుపు -- చిటికెడు
క్యారెట్ తురుము -- ఒక కప్పు
నూనె -- 1/2 కేజీ

తయారుచేయు విధానం:--
నానబెట్టిన పప్పుని తగినంత ఉప్పు వేసి, కొంచెం గట్టిగ రుబ్బుకొని ఉంచుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని, అందులో పెరుగు వేసి, పసుపు, ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి. కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి మెత్తగామిక్సీ చేసి, పెరుగులో కలుపుకోవాలి.ఈ పెరుగులో ఆవాలు కొంచెం పోపుదినుసులు వేసి పోపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలిపెట్టి, నూనె పోసుకుని, కాగాక, పిండిని కొంచెం కొంచెం తీసుకోని, వడలు వేసుకోవాలి, రెండు పక్కల బాగా వేగాక తీసి, ముందుగా చల్లని నీటిలో 2 నిముషాలు ఉంచి, అప్పుడు పెరుగులో వెయ్యాలి. అంటే నోరూరించే పెరుగు గారెలు రెడీ.......క్యారెట్ తురుము, కొత్తిమీర గారెలుపైన అలంకరించుకోవాలి.


క్యారెట్ షర్బత్

క్యారెట్ షర్బత్

కావలసిన పదార్థాలు
పెద్ద క్యారెట్తు - 4 (తురుము చేసి ఉంచుకోవాలి) 
పాలు -- 4 కప్పులు 
పంచదార --6 స్పూన్స్ 
యాలకులపొడి --కొంచెంగా 
జాజికాయలపొడి -- కొంచెంగా 
(యాలకులు , జాజికాయలు కలిపి మిక్సీ లో పొడిగా చేసుకోవాలి)

తయారీవిధానం
(ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది కదండీ.... పిల్లలు, పెద్దలు ఎవరైనాకూడా అన్నం తినమంటే గోలపెడతారు. అలాగే పిల్లలు క్యారెట్, బీట్రూట్ లు తినటానికి మారాం చేస్తారు. అటువంటప్పుడు ఇలా షర్బత్, జ్యూస్ ల లాగా చేస్తే ఇష్టంగా తాగుతారు.)

ముందుగా స్టవ్ వెలిగించి, ఒక పాత్ర పెట్టి సన్నని సెగపై పాలను ఉంచాలి. ఇందులో క్యారెట్ తురుము, జాజికాయ & యాలకుల పొడిని చేర్చి మరగనివ్వాలి. 10 నిముషాలు అయ్యాక స్టవ్ ఆపి, పాలను వేరే గిన్నేలోకి తెసుకోవాలి. చల్లారక పంచదార కలిపి ఫ్రిజ్ లో ఉంచాలి. అంతే చల్లగా, తియ్యగా ఉండే ఈ క్యారెట్ షర్బత్ రెడీ. ఇటువంటి జ్యూస్ లు అంటే పిల్లలు కూడా ఏంతో ఇష్టంగా తాగుతారు.